Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆలేరురూరల్
యువతకు క్రీడలు ఎంతో అవసరం క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీచైర్మెన్్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని మందనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కోటగిరి పాండరి ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివద్ధి సాధిస్తుందని దానిలో భాగంగానే క్రీడారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుదుల నగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాలు పోయడంలో పేరు పొందిన ప్రాంతం ఆలేరు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ ,మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య ,వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ ,ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు ,ఎంపీవో సలీం, మదర్ డైరీ డైరెక్టర్లు శ్రీకర్ రెడ్డి ,సోమిరెడ్డి ,పీఏసీఎస్ చైర్మెన్ మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ ,గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ ,పాల సెంటర్ చైర్మెన్ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.