Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదగిరిగుట్ట దేవస్థానం గుట్టపైకి ఆటోలను అనుమతించాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టిపల్లి అనురాధ అన్నారు. ఆ పార్టీ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 30 ఏండ్లుగా సుమారు 300 మంది ఆటో కార్మికులు ఆటోలను కొండపైకి భక్తులను రవాణా చేస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఈ పరిస్థితిలో నూతనంగా దేవాలయం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కొండపైకి ఆటోలను నిషేధించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వెంటనే ఆటోలను అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కమిటీ కార్యదర్శి మాయా కష్ణ , పట్టణ నాయకులు బందెల ఎల్లయ్య, వన్దాస్ అంజయ్య, ఈర్ల ముత్యాలు పాల్గొన్నారు.
తుర్కపల్లి : గుట్ట పైకి ఆటోలకు అనుమతించి,300 ఆటో డ్రైవర్స్ కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.యాదగిరిగుట్టలో 75 రోజులుగా ఆటో కార్మికులను గుట్టపైకి అనుమతించడం లేదని అటో కార్మికులు దీక్షలు చేస్తున్నారన్నారు. ఆటో కార్మికులను అనుమతిలేకపోవడంతో వీధిన పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .అటోలకు అనుమతించే వరకు జరిగే పోరాటానికి సీపీఐ(ఎం) మద్ధతు ఉంటుందని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్,కొక్కొండ లింగయ్య , అటో యూనియన్ అద్యక్షులు బోయిని సత్తయ్య, నాయకులు కసరబోయిన శివ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలకు అనుమతి కోసం పోరాటాలను తీవ్రతరం చేస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారుశుక్రవారం యాదగిరిగుట్ట ఆటో కార్మికుల రిలే నిరాహార దీక్షలు 75వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆటో కార్మికులు పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్థార్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ గత 74 రోజులుగా 300 కుటుంబాలు ఉపాధి కోల్పోయి తమ సమస్య పరిష్కారం చేయాలని దీక్ష చేస్తున్నప్పటికీ వై టి డి ఎ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బబ్బురి పోశేట్టి, ఆటో కార్మికులు ఏస్ కె మన్సుర్ పాషగుండు సాయిలు, ఎండి చాంద్ పాషా ,బరిగె పాండు ,ఎస్ కె జమాల్ , కొండ జహంగీర్ ,నేలపట్ల రజినీకాంత్ ,కానుగు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : గుట్టపైకి ఆటోలకు అనుమతించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి అనుమతి ఆటోలను అనుమతించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివద్ధి పేరుతో కల్పిస్తామని చెప్తూ ఏండ్ల తరబడిగా గుట్టపైకి నడుస్తున్న ఆటోలను నడపనివ్వకపోవడంతో 300 మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు జీవనోపాధి లేక రోడ్డున పడ్డాయన్నారు. వెంటనే ఆటోలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం, నాయకులు ప్యారారం మైసయ్య, పున్నమ్మ ,ప్యారారం లింగయ్య పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : యాదాద్రి గుట్ట పైకి అనుమతించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి బుర్రుఅనిల్ కుమార్ మాట్లాడుతూ కొద్దిరోజులుగా ఆటో కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే ఆటోలకు అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల నిఖిల్,ప్రేమ్ కుమార్,బన్నీ,గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు:యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతించాలని, ఆటోలను అనుమతించకపోవడంతో 300 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి అన్నారు. యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్టపైకి ఆటోలను అనుమతించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ షేక్ అహ్మద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు గుండు వెంకటనర్సు, జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, నాయకులు కూరెళ్ల రాములు, దడిపెల్లి ప్రభాకర్, పానుగుళ్ల రమేష్, కందుకూరి నర్సింహ, పిట్టల చంద్రయ్య, చామకూరశోభ, అలివేలు, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి ఆటోలను అనుమతించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ ఆటోలను రద్దు చేయడంతో కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోరిగాడి రమేష్, మోరీగాడి మహేష్ ,నల్ల మాస తులసయ్య, జూకంటి పౌలు, బొమ్మకంటి లక్ష్మీనారాయణ ,ఘన గాని రాజు ,అక్కల్ దేవి భాస్కర్ ,కోలా సదానందం, కటకం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : యాదగిరి గుట్ట పైకి ఆటోలను అనుమతించాలని కోరుతూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి సిరిపంగి స్వామి మాట్లాడుతూ గుట్టపైకి 300 ఆటోలను అనుమతించక పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ ,పలుకూరు రామచందర్, మెరుగు వెంకటేశం, పబ్బు నారాయణ, గాన బోయిన యాదగిరి, కొండ నరసింహ ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.