Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నోముల భగత్
నవతెలంగాణ-పెద్దవూర
అభివృద్ధి ,సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాయినవాని కుంట తండాలో బడిబాట, పల్లెప్రగతి బాట నిర్వహించారు. నాయినవాని కుంట తండా,నాయిన వాని కుంటలో 20 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8ఏండ్లలో తెలంగాణ ఎంతో అభివద్ధి సాధించిందన్నారు. మన ఊరు -మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కలిపించామన్నారు.ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీ డియం ప్రవేశపెట్టి బోధన కొనసాగిస్తు న్నామన్నారు. సర్పంచ్ రమా వత్ జానీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాండల అధ్యక్షుడు జటావత్ రవి నాయయక్, టీఆర్ఎస్ కేవి రాష్ట్రనాయకులు భషీర్,యూత్ నాయకులు మెండే సైదులు,ఎంపీఓ విజయ కుమారి, ఏ ఓ సందీప్ రెడ్డి, ఏఈ రామకష్ణ, కాంట్రాక్టర్ సందీప్, ప్రధానోపాధ్యాయులు శ్రీను, జాహిదా,అంగన్వాడీి టీచర్ నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.