Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ మాజీ చైర్మెన్ బీరవోలు సోమిరెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
ఆయిల్‌పామ్ పంటలు సాగుచేసినట్టయితే అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని డీసీసీబీ మాజీ చైర్మెన్ బీరవోలుసోమిరెడ్డి అన్నారు. శనివారం మండలపరిధిలోని వేల్పుచెర్ల గ్రామంలో సదాశివరెడ్డి సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ తోటను సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంటకు ప్రస్తుత మార్కెట్లో మంచిగిరాకీ ఉందన్నారు.టన్ను రూ.24 వేల ధర పలుకుటుందన్నారు.నీటివసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగుచేసి మంచిఆదాయం పొంది ఆర్థికంగా అభివద్ధి సాధించాలని సూచించారు.ఆయిల్‌పామ్ సాగులో చేపట్టాల్సిన చర్యల గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.తాను కూడా 10 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వివరించారు.అతని వెంట ఆయిల్ పామ్కంపెనీ ఫీల్డ్‌ఆఫీసర్ శశికుమార్,సూపర్వైజర్ రంగు ముత్యంరాజు , రైతులు బి.జానయ్య, నాగరాజు, లింగయ్య ఉన్నారు.