Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ప్రచార ఆర్బాటానికె పరిమితమైందని ఎంపీపీ పుట్టల సునీత కపయ్య అన్నారు.శనివారం మండలంలోని శెట్టిపాలెం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు.ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అన్ని వసతులను సమకూర్చి పాఠశాలలను తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పారన్నారు.కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేస్తున్నామని నేటి వరకు మంజూరు చేయలేదన్నారు.కొన్ని పాఠశాలల్లో స్కూల్ భవనాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పాఠశాలలకు నిధులు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్ల వీరయ్య,కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు పల్లా వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బుషిరెడ్డి వెంకట్‌రెడ్డి, చల్ల వెంకట్‌రెడ్డి, బొంత పుల్లయ్య, జగన్ రెడ్డి, పెంట మల్ల శ్రీను, ముత్తయ్య, వెంకటేశ్వర్లు,వెంకటరెడ్డి, వనం లక్ష్మీనర్సు, అజిత్‌రెడ్డి, వంశీరెడ్డి, సాయితేజ పాల్గొన్నారు.