Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 13వ వార్డులో వార్డు కౌన్సిలర్, వైస్‌చైర్మెన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అధ్యక్షతన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వీధివీధినా పర్యటించి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వైస్‌చైర్మన్ చల్లా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరే విధంగా పని చేస్తామన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివద్ధి చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ పట్టణప్రధానకార్యదర్శి చిత్తలూరి సైదులు,13వార్డు అధ్యక్షులు సులవయాదగిరి, వేమూరి నారాయణ, బుడిగిచంద్రయ్యగౌడ్, తిక్కలశ్రీకాంత్, రూపానిఉదరు, కొమర్రాజువెంకట్, ఝాన్సీ, ఆర్పీ ఆకారపు అనంతలక్ష్మి,13వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.