Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-అనంతగిరి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల రుణమాఫీ చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా కొత్తగూడెం, గోండ్రియాల,శాంతినగర్, లకారం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చడానికి తమ పార్టీ వారికి అండగా ఉంటుం దన్నారు.రైతును రాజు చేయడమే పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు.ా్నరు.రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగు పడ్డ చరిత్ర లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో ఒక క్వింటాలుకు 5 నుండి 6 కిలోల ధాన్యం కటింగ్ చేస్తున్నారని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా కింద కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ.15 వేల పెట్టుబడిసాయం, ఉపాది హమీ కూలీలకు ఏటా రూ.12వేల ఆర్థిక సాయం, వ్యవసాయానిక ఉపాధి హమీ అనుసందానం, రైతులు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర, మెరుగైన పంట బీమా, రైతులు, కూలీలు, భూమి లేని రైతులకు రైతు భీమా, ధరణి పోర్టల్ రద్దు సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఇలా అనేక కార్యక్రమాలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుబందు తప్ప రైతుల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయ లేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పధ కాలు అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రచ్చబండ లో భాగంగా గోండ్రీ యాళ గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి గ్రామస్తుల నుండి చేదు అనుభవం ఎదురైంది. 11 సంవత్సరాల తర్వాత మా గ్రామం గుర్తుకు వచ్చిందా కేవలం ఓట్ల కోసమే గ్రామంలో పర్యటిస్తున్నారా అని గ్రామస్తులు ప్రశ్నించారు.ఆయనతో వాగ్వాదానికి దిగడంతో మీ ఓట్లు మాకు అవసరం లేదంటూ అక్కడనుంచి ఆయన వెళ్ళి పోవడం గమనార్హం.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, నాయకులు వంగవీటి రామారావు, గునుకుల గోపాల్‌రెడ్డి, పలు గ్రామాల అధ్యక్షులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు.