Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-చందంపేట
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని విశ్వసించే తెలంగాణ ప్రభుత్వం అదే స్ఫూర్తితో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శం అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.శనివారం మండలం గాగిల్లపురం గ్రామంలో రూ.12.60లక్షలతో నిర్మించిన శ్మశానవాటికను,రూ.5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను,రూ.4లక్షలతో నిర్మించిన పాఠశాల పహరీని, పల్లెప్రకృతివనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పల్లెప్రగతితో గ్రామాలు గుణాత్మక మైన మార్పు చెందుతున్నాయన్నారు.గ్రామాలు సర్వాంగసుందరంగా ముస్తాబవు తున్నాయన్నారు.ఈకార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ కష్ణయ్య,సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు దొందేటి మల్లారెడ్డి,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య,మండల ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్‌రెడ్డి,రైతుబంధుమండల అధ్యక్షులు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్,స్థానిక గంగిడి కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ రజితరామకష్ణ,ఏర్పుల గోవింద్ యాదవ్, రమావత్మోహన్కష్ణ,గోసులఅనంతగిరి,బొల్గు రామకృష్ణ,బొడ్డుపల్లి కష్ణ, బిజిలి సుధాకర్, వాడిత్యబాలు, మర్లశ్రీశైలం, నాగార్జున్, నాగిళ్ళ మహేష్, ఉపసర్పంచ్ భూపాల్‌రెడ్డి, కుమార్, శోభన్,రమేష్, ఏడుకొండలు, యాదయ్య,పంచాయతీరాజ్ డీఈ లింగారెడ్డి, ఏఈ రాజు, యాదగిరి, గంగిడి వెంకట్‌రెడ్డి, కడారి కొండయ్య పాల్గొన్నారు.