Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెమ్మికల్‌లో ఎండిన మొక్కలు
- మొక్కలు, ప్రహరీ లేని శ్మశానవాటిక సందర్శన
- సర్పంచ్ అధికారులపై మండిపాటు
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
ఎండిన నర్సరీ,ఖాళీసంచులు, ప్రహరీ, ఒక్క మొక్క లేని శ్మశానవాటికను పరిశీలించిన కలెక్టర్ వినరుకష్ణారెడ్డి సర్పంచ్,అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మండలపరిధిలోని నెమ్మికల్‌లో శనివారం పల్లెప్రకతివనం,శ్మశానవాటికను సందర్శించారు.పల్లెప్రకతివనంలో మొక్కలు లేకుండా మట్టి నింపిన సంచులు ఉన్న మొక్కలకు నీళ్లు లేక వాడి పోవడంతో అధికారులపై మండిపడ్డారు.చెరువు పక్కనే ఉన్నది...కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయి.. కొద్దీ రోజుల్లో హరితహారం కార్యక్రమం ఉండగా నర్సరీలో మొక్కలు పెంచకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఉన్న కొద్ది మొక్కలు కూడా పిచ్చిమొక్కల్లా చిందరవందరగా నీళ్లు లేక సంరక్షణ లేక ఎండిపోవడంపై పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం శ్మశానవాటికలో ప్రహరీగోడ లేదు.. కనీసం మొక్కలు కూడా పెట్టలేదని సర్పంచ్‌పై మండిపడ్డారు.డంపింగ్‌యార్డు,శ్మశానవాటికకు మధ్య ఉన్న ప్రభుత్వభూమిని ఆక్రమించిన వారిపై ఫిర్యాదు చేయండి..చర్యలు తీసుకుంటామన్నారు.నిధులున్నా పనులు జరుగక పోవడంపై గ్రామ పంచాయతీని అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.కనీసం తాను నాటేందుకు మొక్క గాని.. నీళ్లు గాని లేక పోవడం దారుణమన్నారు.పల్లెప్రగతిపనులను నిర్లక్ష్యం చేసిన గ్రామ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంపలదావీదు, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్, ఎంపీఓ సంజీవ, గ్రామ కార్యదర్శి హరికష్ణ పాల్గొన్నారు.