Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ వ్యాపారాలపై పటిష్టమైన నిఘా
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే మంచి పేరు, పోలీసు ఇమేజ్, గుర్తింపు వస్తుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం నందు జరిగిన నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం అవగాహనా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో అధికారం, బాధ్యతలు ఇచ్చారని, వాటిని సక్రమంగా నిర్వర్తించి అక్రమ కార్యకలాపాలు, అసాంఘీకకార్యకలాపాలు, అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలు అడ్డుకోవాలన్నారు. సమాజ భద్రతకు, ప్రజలను మోసాలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు, ప్రజలకు భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.కేసులను త్వరగా పరిష్కరించాలని, దర్యాప్తు చేసి నేరాలకు పాల్పడే వారికి చట్టపరమైన శిక్షలు అమలైయ్యేలా పని చేయాలన్నారు.కేసులు పెండింగ్ ఉండకుండా కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలని పేర్కొన్నారు.ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.విజువల్ పోలీసింగ్ చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్ల నందు క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి సూచించారు. పిటిషన్ మేనేజ్మెంట్, అంతర్జాల నమోదు, సైబర్ ఫ్రాడ్స్ నివారణ కు కషి చేయాలన్నారు.అసాంఘికకార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఆన్లైన్లో మోసాలకు గురైన బాధితులకు తక్షణ సహాయం అందించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ు4జ)ను తెలంగాణ పోలీసు నిర్వహిస్తుందని తెలిపారు.ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 1930కు షషష.షybవతీషతీఱఎవ.స్త్రశీఙ.ఱఅ నందు ఫిర్యాదుచేయాలని కోరారు.ఈ సమావేశంలో డీఎస్పీలు రెహమాన్, నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్బీ సీఐ శ్రీనివాస్,డీసీఆర్బీ సీఐ నర్సింహ, సీఐలు విఠల్‌రెడ్డి, ఆంజనేయులు, రామలింగారెడ్డి, నర్సింహారావు, పీఎస్డీ.ప్రసాద్, నాగార్జున, మునగాల సీఐ ఆంజనేయులు,సీసీఎస్ సీఐ రవి, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.