Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
ఈనెల 16,17వ తేదీల్లో జిల్లాకేంద్రంలోని విఘ్నేశ్వర ఫంక్షన్హాల్లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం జిల్లాకేంద్రంలోని స్థానిక మల్లువెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరలను పెంచడం మూలంగా పేద,మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారతరాజ్యాంగాన్ని అవమానపరిచిన విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.బీజేపీ ప్రభుత్వం కులం,మతం పేరుతో ప్రజలను విభజించి రెచ్చగొట్టి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.దళితులఅందరికీ దళితబంధు పథకం ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పెంచిన విద్యుత్, బస్చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు.జిల్లాలో రైతులు ,పేదలు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు,దళితులు, గిరిజనులు ,విద్యార్థి, యువజన ,మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం బలమైన ప్రజా ఉద్యమాలను నిర్వహించేందుకు పార్టీ కర్తవ్యాలను రూపొందిస్తుందని వెల్లడించారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నగరపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, మట్టిపెళ్లిసైదులు,కోటగోపి, ఎల్గూరి గోవింద్, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,జిల్లాపల్లి నర్సింహారావు,వేల్పుల వెంకన్న,వీరబోయినరవి, చిన్నపంగనర్సయ్య, దేవరం వెంకట్రెడ్డి, కొప్పుల రజిత, మేకనబోయిన సైదమ్మ, మిట్టగడుపుల ముత్యాలు, పల్లె వెంకట్రెడ్డి,మేకనపోయినశేఖర్,పులుసు సత్యం, మండల కార్యదర్శులు సిరికొండ శ్రీను, రణరంగ కష్ణ తదితరులు పాల్గొన్నారు.