Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీయస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్
నవతెలంగాణ- కట్టంగూర్
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీి దళిత బంధు అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలంలోని కురుమర్తి గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత పేదల సమస్యలపై సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారన్నారు., ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇళ్లు,ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఇల్లు కూడా పేదలకు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దళిత బందు నియోజకవర్గానికి వంద,పదిహేను వందలు మందికి కాకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నకిరేకల్,14న కట్టంగూర్ తహసీల్దార్ లకు దళిత బందు దరఖాస్తులు పేదలతో కలిసి అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు చిలుముల రామస్వామి ,మండల నాయకులు డి.నాగయ్య ,ఇంద్రకంటి బాలకష్ణ, ఎల్లమ్మ, చంద్రమ్మ, గద్దపాటి పద్వి,మల్లమ్మ, నరసింహ, లక్ష్మి,మంజుల, భారతి పాల్గొన్నారు.