Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-కట్టంగూరు
మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చిలకమర్రి రాములు(96) మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిలకమర్రి రాములు శనివారం మతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని చెరుపల్లి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి అంకితభావంతో పనిచేసి పార్టీ అభివద్ధికి ఎనలేని కషి చేశారన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలో పార్టీ విస్తరించడంలో కీలక పాత్ర పోషించారున్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినాముందు వరుసలో ఉండే వారన్నారు. వారి మరణం వారి కుటుంబానికి కాదు పార్టీ కూడా తీరని లోటన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట.నగేష్, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు నాయకులు చిలుముల రామస్వామ,రవీంద్రాచారి ఉన్నారు.
వేముల నివాళులు
రాములు భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, స్థానిక సర్పంచ్ చెనగోని సతీష్ ఉన్నారు.