Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దామరచర్ల
మండలంలోని పుట్టలగడ్డ గ్రామంలో రూ.2 కోట్లా 49 లక్షలు, వీర్లపాలెం లో రూ 3 కోట్లా 66 లక్షలతో నిర్మితమవుతున్న చెక్ డ్యాంల నిర్మాణాలకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, ఎంపీపీ బాలాజీ నాయక్, జెడ్పీటీసీి అంగోతు లలిత-హతిరం, సేవ్యా నాయక్, మాజీ ఎంపీపీ కురాకుల మంగమ్మ, దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగని వెంకటేశ్వర్లు, ఐబీ ఈ ఈ లక్ష్మణ్, డి ఈ జనార్ధన్, ఏ ఈ బిక్షం, కొండేటి సిద్దయ్య, మాజీ సర్పంచ్ కొట్య నాయక్, ఈశ్వర్ నాయక్, జానకి రాములు, లింగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నట్టల నివారణ మందు పంపిణీ చేసిిినన ఎమ్మెల్యే
గొర్రెలు ,మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని దామరచర్ల లో శనివారం ఎమ్మెల్యే బాస్కర్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 3042 గొర్రెలకు 1316 మేకలకు మొత్తం 4358 జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరకోటి రెడ్డి ,పశు సంవర్డక శాఖ ఏడీ వెంకట్ రెడ్డి , పశు వైద్యులు స్వప్న,. అనుదీప్ , సిబ్బంది, గోపాల మిత్రలు సర్పంచ్ బంటు కిరణ్ , తదితరులు పాల్గొన్నారు.