Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
ప్రజలకు,అధికారులకు మధ్య వారధిగా సమాచార హక్కు చట్టం పని చేస్తుందని సమాచార హక్కు చట్టం జోనల్ ఇన్చార్జి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్టం జిల్లా ఉపాధ్యక్షులు కూనపరెడ్డి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.2005 లో స్థాపించబడిన సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 2,500 మంది సభ్యులతో విస్తరించిందన్నారు. జిల్లాలో 140 మంది సభ్యులు సమాచారహక్కు చట్టం బలోపేతానికి విశేష కషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే సమాచార హక్కు చట్టం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు.ప్రభుత్వం ఇస్తున్న నిధులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఏ విషయమైనా సమాచార హక్కు చట్టంపై ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.సమాచార హక్కు చట్టం ప్రజలకు అధికారులకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ సంఘటితమైన వ్యవస్థగా ఏర్పడి ప్రజలకు సేవ తెలుస్తుందన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తిని నాగేశ్వర్రావు, గౌరవ అధ్యక్షులు వంగవీటిశ్రీనివాస్రావు, బద్దంరాజు, కష్ణప్రసాద్,రషీద్,గెల్లా పవన్,అంజి, వెంకటేశ్వర్లు, పరుశరాం,మణికంఠ, సుధాకర్, రామారావు, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.