Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-అనంతగిరి
అసమర్థ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అవసరమా అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని ఖానాపురం, వెంకటరామపురం, గోల్‌తండా, అమీనాబాద్,త్రిపురవరం గ్రామలలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.వరంగల్ డిక్లరేషన్‌ను గ్రామా గ్రామగ్రామాన ప్రజల్లోకి చేరవేసే దిశగా రచ్చబండ కార్యక్రమం చేపట్టామన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.ల్యాండ్, స్యాండ్,మైన్స్, వైన్స్‌ల వ్యాపారమే టీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకు న్నారన్నారు.ప్రజా సమస్యలను గాలికి వదిలి రూ.100 కోట్లు దోచుకున్నారన్నారు.రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.స్థానిక ఎమ్మెల్యే చిన్న వ్యాపారస్తుల దగ్గరనుండి మద్యం సిండికేట్ల వరకు దోచుకున్న డబ్బులను దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. అలాంటి నాయకులకు ప్రజలు కచ్ఛితంగా బుద్ధి చెబుతారన్నారు.రాష్ట్రంలో ప్రతిపల్లెలో, గిరిజన వాడలో రోడ్లు వేయించామని, ఇండ్లు కట్టించామని ,అభివద్ధి చేసి చూపిన ఘనత కేవలం కాంగ్రెస్‌కే దక్కిందని గుర్తు చేశారు. కేవలం మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు.2023 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో పార్టీ 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, టీపీసీసీ రాష్ట్రకార్యదర్శి చింతకుంట్లలక్ష్మారెడ్డి, వంగవీటి రామారావు, పార సీతయ్య, సర్పంచులు నాగార్జున, కోటేశ్వరరావు, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.