Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాన్న జ్ఞాపకార్థం చెస్పోటీలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది
- చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి కపాకర్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు చెస్ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కపాకర్ అన్నారు. గండూరి సత్యనారాయణ జ్ఞాపకార్థం శనివారం రాత్రి స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా ఓపెన్ చెస్ఛాంపియన్ షిప్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేండ్లుగా కరోనా విస్తతరూపం దాల్చడంతో చెస్ క్రీడాకారులు తమ ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు పోటీలు నిర్వహించకపోవడంతో చెస్ క్రీడాకారుల్లో నిరుత్సాహం నెలకొందన్నారు.నాన్న గండూరి సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 80మంది క్రీడాకారులు హాజరుకావవడం ఆనందంగా ఉందన్నారు.చెస్ క్రీడాకారులు దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ క్రీడాపోటీలు దోహదం చేస్తాయన్నారు.చెస్ క్రీడాకారులు ఎక్కడ పోటీలు నిర్వహించిన హాజరై తమ ఆటలో ప్రతిభను మెరుగుపర్చుకొని ప్రపంచ విజేతలుగా నిలవాలని పేర్కొన్నారు.అనంతరం విజేతలైన విద్యార్థులకు ప్రథమబహుమతిగా రూ 1500, ద్వితీయ రూ.1000, తతీయ రూ. 800, చతుర్థ రూ.600, పంచమ రూ.500, ఆరవ రూ.400, ఏడవ రూ.300, ఎనిమిదవ రూ.200లు నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు.అలాగే అండర్ 15, 13, 11, 9, 7లో విజేతలైన బాల బాలికలకు ప్రథమ, ద్వితీయ, ప్రత్యేకంగా మహిళా, డఫ్ అండ్ డమ్ క్రీడాకారునుకి ట్రోఫీలు అందజేశారు.చెస్ మాస్టర్ కవిత సతీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, సుదర్శన్, నాగరాజు, బజ్జురి శ్రీను, మిట్టపల్లి రమేష్, వెంపటి శబరి, కుక్కడపు భిక్షం, సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.