Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ కనకదుర్గా దేవి ఆలయం తృతీయ వార్షికోత్సవ వేడుకలు గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగాయి .మొదటి రోజు ఉదయం అయిదు గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో ఇతర అర్చకులతో కలిసి అభిషేకం కుంకుమార్చన అలంకరణ ఆరగింపు నిత్యాన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాన్ని ఉత్సవాల సందర్బంగా రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు .పట్టణంలోని పురవీధుల గుండా ఉత్సాహ విగ్రహాల ఊరేగింపులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నార. కళాకారులు ఆటలు పాటలు డప్పు వాయిద్యాలతో కోలాటాలతో పట్టణంలో ఉత్సవమూర్తులను .గురువారం ఉదయం ప్రారంభమైన శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవం ముగింపు సందర్భంగా పట్టణానికి వివిధ ప్రాంతాల నుండి బంధుమిత్రులు హాజరైన అమ్మవారిని దర్శించుకున్నారు . శుక్రవారం రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి మల్లికార్జునస్వామి నీ ఎదుర్కొళ్లను నిర్వహించారు .సాయంత్రం ఆరు గంటలకు శ్రీ కనకదుర్గాదేవి మల్లేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిత్యపూజలు, మహాపూజ చేశారు. ఆదివారం బంధుమిత్రులతో వనభోజనాలు నిర్వహించడం జరిగింది .వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. బంధుమిత్రులతో కలిసి పట్టణంలోని ప్రజలు వనభోజనాలు నిర్వహించేందుకు వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లారు. మరికొందరు వనభోజనాలకి బదులు ఇంటి వద్దే వచ్చిన బంధుమిత్రులతో పండుగ నిర్వహించారు.పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య ,తహసీల్దార్ గణేశ్నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరెడ్డి ,ఎంపీడీవో జ్ఞానప్రకాశ్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై అడిషనల్ ఎస్ ఐ ఎండి.ఇద్రిస్ అలీ , వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. .ఆలయ కమిటీ సభ్యులు నీలం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆలేరు ఎస్సై ఎండి ఇద్రిస్అలీ అర్చనలు ఎస్సై వెంకట శ్రీనివాస్ పోలీస్ సిబ్బందికి ఆలయంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు . స్త్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయాన్నే ఉండే వస్తున్న భక్తుల సందడితో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. భక్తుల తాకిడి తట్టుకునేలా బారీకేడ్లు క్యూలైన్లు ఏర్పాటు చెయ్యడం జరిగింది . చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొట్టారు .భక్తులు ఆలయ ప్రాంగణంలో తమ మొబైల్ ఫోన్ తో సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలుపుల హరినాథ్ ,కమిటీ సభ్యులు బేతి రాములు ,కామిటికార్ అశోక్, యేలుగల కుమారస్వామి ,ఎలుగల మధుసూదన్ , సాత్విక్ దేవ్ ,సాహితీ రాజు, పత్తి రాములు , లావణ్య , స్వర్ణలత ,పత్తి సతీష్ మాధురీ , ఐశ్వర్య ,వడగము వేంకటేశు, వడగము లతా, బద్రి, సాయి , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.