Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఉదత విరోచన అతిసార వ్యాధి నిరోధక కార్యక్రమ పక్షోత్సవాల నేటి నుండి ప్రారంభిస్తున్నట్టు వైద్యాధికారి సుధీర్ చక్రవర్తి అన్నారు.ఆదివారం మండలపరిధిలోని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 13 నుండి 27 జూన్ 2022 వరకు కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రపరిధిలోని అన్ని గ్రామంలో 0- 5 ఏండ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్స్ పంపిణీ చేస్తామన్నారు.విరేచనాలతో పాటు వాంతులు,తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం,వికారంగా ఉండటం,ఆకలి మందగించడం మొదలగు లక్షణాలుఉంటే వైద్యసిబ్బందిని సంప్రదించాలని, లవణాలు కలిగిన ద్రావణాన్ని సేవించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యాధికారులు డాక్టర్.కళ్యాణ్ నాయక్, డాక్టర్.సుమంత్, డాక్టర్. కష్ణవేణి,సూపర్వైజర్ సిద్ధమ్మ, ఏపిఎంఓ విజరుభాస్కర్, హెల్త్అసిస్టెంట్స్ విజరుకుమార్, శ్రీనివాస్,ఏఎన్ఎం భవాని,ఇందిరా, విజయలక్ష్మి, పద్మ, లక్ష్మీసుధ, చంద్రకళ, రూప, గోపమ్మ, ప్రమీల, జీవమ్మ, మాధురి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.