Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హాలియా
ప్రజల చేత..ప్రజల కోసం ఎన్నికైన సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర గవర్నర్ ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తామని ప్రజల విన్నపాలు విని తీసుకుంటామని చెప్పినా సర్వఅధికారాలు కలిగిన సీఎం స్పందించకపోవడం ప్రతిపక్షాల సూచనలు, ప్రజల విన్నపాలు స్వీకరించకపోవడంతో ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు.రాజకీయ లబ్దికోసం ప్రజాదర్బార్ నిర్వహించడం కాదని, ప్రజాసమస్యల పరిష్కారం మార్గం కోసం ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ముగాస్తూ రైతులు కష్టించి పండించిన ధాన్యానికి మొక్కుబడిగా మద్దతు ధర ప్రకటించడం దారుణమన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి నేటికి విస్మరించడం సరికాదన్నారు.స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేయాలని, కౌలురైతులకు రైతుబంధు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని, కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతు సమస్యలపై జూన్ 13,14వ తేదీల్లో మండలకేంద్రాల్లో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో డబుల్బెడ్రూం ఇండ్లను అందరికీ వర్తింపచేస్తామని చెప్పి, భూమి ఉన్న వారికి రూ.6 లక్షలిస్తామని నేడు రూ.3లక్షలకు తగ్గించిందని అది కూడా అమలుకు నోచడం లేదన్నారు. డీజిల్, పెట్రోల్ ,ఆర్టీసీ, కరెంట్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపి సంపన్నులకు రాయితీలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సాగర్ ఉపఎన్నిక సందర్భంగా అనేక వాగ్దానాలు గుప్పించి నేటికీ ఏ ఒక్కటి అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శ మన్నారు.హాలియాలో 48 సర్వే నెంబర్లో ఉన్న పేదలకు వెంటనే ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూన్రెడ్డినాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అవుతాసైదులు, నాయకులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, కొర్రా శంకర్‌నాయక్, దుబ్బరామచంద్రయ్య, పొదిలి వెంకన్న, దోరేపల్లి మల్లయ్య, రవీందర్, వెంకన్న పాల్గొన్నారు.