Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలంలోని చిమిర్యాల గ్రామంలో గ్రామానికి చెందిన ఎంఏ.గఫూర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం బతకడంతో పాటు ఇతరులకు మనకున్న దాంట్లో కొంతసహాయం చేయడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు.దానికి మించిన సంతప్తి ఏదీ ఉండదన్నారు. గఫూర్ రంజాన్ మాసంలో పేదలకు ఉచిత బియ్యం కరోనా కాలంలో పేదలకు ఆహారం అందించడమే కాక గ్రామంలో నిత్యము ఉచిత మినరల్ వాటర్ అందిస్తున్నారన్నారు. అంతేకాక 50000 విలువ కలిగిన ఫ్రీజర్ అందించటమే కాక 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు వారికి అవసరమైన లక్ష రూపాయలు మందులు అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయ పడాలని దాతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి, సర్పంచ్ కొండ శైలజ, ఎంపిటిసి కె.సౌజన్య బాలకష్ణ ,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్, కార్యదర్శి అప్పారావు, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ ,పూర్ణ , నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.