Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెట్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి
టెట్ పరీక్షల సందర్భంగా ఆదివారం ఉదయం పట్టణంలోని వెన్నెల కళశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రంలోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. సెంటర్లోని ఏర్పాట్లను ఇతర సదుపాయాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉదయం 31 సెంటర్లలో 7,378 మంది అభ్యర్ధులు పరీక్ష రాయాల్సి ఉండగా అందులో 6,353 మంది హాజరైనట్టు 1025 మంది హాజరు కాలేదని ఆమె తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
టెట్ పరీక్షల సందర్భంగా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉదయం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకసింకంగాతనిఖీ చేశారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ ఉన్నారు.
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టెట్ రెండు పరీక్షలు ఆదివారం మండల కేంద్రంలో ముగిసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షకేంద్రం 240 అభ్యర్థులను కేటాయించగా 195 మంది పరీక్షకు హాజరైన 44 మంది గైర్హాజర్ అయినట్లు చీప్ సూపరిండెంట్ వీరబాబు తెలిపారు కష్ణవేణి టాలెంట్ పరీక్ష కేంద్రంలో 178 మంది అభ్యర్థులను కేటాయించారు 142 మంది అభ్యర్థులు హాజరు 36 మంది గైర్హాజర్ అయినట్లు చీఫ్ సూపర్నెంట్ ఈశ్వరయ్య తెలిపారు.