Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1998-90 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ- రామన్నపేట
జీవితమంటే పూలపానుపు కాదని విద్యార్థి దశలోనే జీవిత అనుభవాలను అధ్యయనం చేస్తూ పరిపూర్ణ వ్యక్తిగా తయారు కావాలని తద్వారా క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించే వచ్చునని పలువురు విద్యార్థులు తమ అనుభవాల ఆధారంగా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1998-90 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొట్టమొదట స్థానిక బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు గార్లపాటి రవీందర్, జలందర్ రెడ్డి, చిన్న రవీందర్ లను ర్యాలీగా సభావేదిక వద్దకు తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. నాకు విద్యార్థులకు గురువులు శుభాశీస్సులు అందజేశారు. పూర్వ విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. పాల్వంచ హరికిషన్ వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోదాసు రమేశ్, మిర్యాల ఆనంద్, బావండ్లపల్లి సత్యం, బొడ్డు బిక్షం, తిరుగుడు కష్ణ, నకిరెకంటి మొగిలయ్య, జల్లెల పెంటయ్య, రామిని రమేశ్, ఆకారం నర్సింహ, గంగుల సోమేశ్వర్ రెడ్డి, బొడ్డు శ్రీను, ఫేరోజ్ పాషా, బోయపల్లి యాదయ్య, జావేద్, సురేందర్ రెడ్డి, కోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.