Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా విద్యుద్ఘాతమై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.ఎస్సై అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వేల్పుచర్ల గ్రామానికి చెందిన ఖమ్మం పాటి సతీశ్(33) పదేండ్ల నుండి మండలకేంద్రంలోని సబ్స్టేషన్లో మర మ్మతుల పనులు చేస్తున్నాడు. రోజువారీలో పనిలో భాగంగా సోమవారం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యు ద్ఘాతమైంది. దీంతో తోటి సిబ్బంది సతీష్ 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తికి తర లించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.