Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ బడుల్లో వసతులు నిల్
- పుస్తకాలు, యూనిఫామ్ లేదు
- స్వీపర్‌కు దిక్కులేదు
బడి గంట మోగింది...పిల్లలు బడికి రానే వచ్చారు. కానీ పాఠశాల వాతావరణంలో ఏలాంటి మార్పులేదు. అవే పాత గోడలు, కనీస వసతులు లేక కొట్టుమిట్టాడతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, అడ్రస్ లేని మన ఊరు- మన బడి పథకం... చాలా పాఠశాలలో ప్రారంభం కాని మధ్యాహ్నాం భోజనం. తాగునీటికి కూడా అల్లాడిన విద్యార్థులు. బడి మొదలయ్యే నాటి అందాల్సిన పుస్తకాలు లేవు.. దుస్తులు లేవు... ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ బడులు ప్రారంభమయ్యాయి.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
విద్యాసంవత్సరం ప్రారంభంలో బాగంగా బడి గంట మోగింది. అనేక సమస్యలకు నిలయంగా పాఠశాలలు ఉన్నాయి. కరోనా వైరస్ తర్వాత ఉత్సహంగా ఈ ఏడు బడులు మొదలైయ్యాయి. కరోనా వైరస్ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెద్దఎత్తున పెరిగింది.గతం కంటే ఎక్కువగా ప్రవేటు పాఠశాలలో ఫీజులు భారిగా పెరగడం వల్ల, ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమంం ప్రారంభిస్తుడడంతో సామాన్య మద్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. కానీ ఉపాధ్యాయ ఖాళీలు కూడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి మన ఊరు-మన బడి పేరుతో నిధులు మంజూరు చేసి బడులకు కొత్త కళ తేనున్నట్లు ప్రభుత్వం గత విద్యాసంవత్సరం చివరి నుంచి చెపుతున్నప్పటికి ఇప్పటివరకు ఏ బడిలో వసతులు ఏర్పాటు కాలేదు. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం కూడ కరువైంది. పాఠశాలల ప్రారంభోత్సవం గ్రామంలో పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఇపుడు పాఠశాలను శుభ్రం చేయడానికి కనీసం స్వీపర్ కూడ లేకుండా పోయారు. గ్రామాలలో పంచాయితీ కార్మికులతో పాఠశాలను శుభ్రం చేయిచుకోవాలని ఆదేశాలున్నప్పటికి ఆచరణలో సాధ్యం కావడంలేదు. పంచాయితీ సర్పంచ్‌లు పాఠశాలలో పారిశుద్యం తమ పని కాదని, గ్రామంలో పనిచేయడానికే సిబ్బందిలేరని ఆ ఇష్టత చూపిస్తున్నారు. ఇక మున్సిపాలిటి కేంద్రాలలో కూడ అదే పరిస్థితి ఉంది. పాఠశాలలను చివరికి పంతుళ్లే శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది.
-- పాఠ్యపుస్తకాలేవీ...
ప్రభుత్వానికి ఏలాంటి ముందు చూపు లేదనడానికి ప్రత్యక్ష ఉదహారణ పుస్తకాలే.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అవసరమైన పుస్తకాలు 10,79,696 కాగా ఇప్పటివరకు దిగుమతి అయిన పాఠ్యపుస్తకాలు కేవలం 2,1,2,150 మాత్రమే ఉన్నాయి. చాలా పాఠశాలలకు ఇప్పటివరకు పుస్తకాలు చేరలేదు.అవి వచ్చేది ఎపుడు.... పిల్లలకు చేరేదేపుడూ.. వాళ్లు చదివేదేపుడూ.... అంతగందరగోళంగా ఉంది పరిస్థితి.
-- యూనిఫామ్ రాలే....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4034 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 411634 మంది విద్యార్థులు విధ్యాభ్యాసం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 2042 సూర్యపేట జిల్లాలో మొత్తం 1280 ప్రభుత్వ పాఠశాలలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 712ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం విద్యార్థులకు పాఠశాల ప్రారంభం నాటికే స్కూల్ యూనిఫామ్ రావాల్సి ఉంది. కానీ నేటి వరకు అందలేదు. ఎపుడు అందుతుందో కూడ విద్యాశాఖ అధికారులకు స్పష్టత లేదు.