Authorization
Wed April 02, 2025 02:56:20 pm
నవతెలంగాణ-నాంపల్లి
ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టుశివ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి తహశీల్దార్ చిలుకూరి లాల్ బహదూర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని అన్నారు. సంక్షేమ పథకాలకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధుల ద్వారా ప్రతి కుటుంబానికి పది లక్షలు రూపాయలు ఇవ్వటం పెద్ద సమస్య కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కౌలురైతు జిల్లా సంఘం కార్యదర్శి ముత్తిలింగం, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము లక్ష్మయ్య, నేరెళ్ల నరసింహ, ఒంగురి యాదయ్య, నూనె లక్ష్మమ్మ, గడ్డం గురుమూర్తి, కష్ణయ్య, ఆకారపు రజిత, మధ్యల గీత, వాసిపాక యాదమ్మ,దితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజక వర్గంలో కట్టినట్టు వంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పరశురాములు ప్రభుత్వాన్ని కోరారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 సంవత్సరాల క్రితం పూర్తి అయినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరారు.అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలని పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలిపోయే స్థితికి వచ్చేయని ఆయన ఇల్లు పంపిణీ చేయడం లేదని వాపోయారు. గ్రామాలలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఎక్కడ మూడు ఎకరాలు పంచింది లేదని అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు ఇస్తామని చెప్పి అట్టహాసంగా ప్రారంభించిన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇంతవరకు ఎక్కడా దళిత బంధు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుట్టల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు కోడిరెక్క మల్లయ్య, బొల్లంపల్లి పాపారావు,బొంగరాల వెంకటయ్య, జిల్లా నగేష్,మిర్యాలగూడ మండల అధ్యక్షురాలు గోపాల్‌దాస్, సువార్త, నాయకులు రేేవూరు సుజాత, మీసాల నాగమ్మ,బొజ్జ రేణుక, పోలేపల్లి సైదమ్మ, జిల్లా లక్ష్మి, మిట్టపల్లి పేరయ్య, రేవూరి సువార్త, గజ్జి గోపి, నూకపంగు పెద్దవెంకన్న పాల్గొన్నారు.