Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే
నవతెలంగాణ-పాలకవీడు
రూ.3 వేల కోట్లతో హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యేశానంపూడి సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు.సోమవారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ బొత్తలపాలెంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్రీడాప్రాంగణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 20 సంవత్సరాల పాటు హుజూర్నగర్ నియోజక వర్గాన్ని.. అభివద్ధిలో వెనక్కి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందని.. ఎద్దేవా చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని.. మదన పడుతున్నాడని విమర్శించారు.దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీలుగా.. తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు. పల్లెప్రకతి వనాలు, శ్మశానవాటికలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, రైతు వేదికలు, సీసీరోడ్లు, డ్రయినేజీల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీలు, కార్యదర్శుల నియామకం మొదలైనవన్నీ సీఎం ఆలోచనలు గ్రామాల అభివద్ధికి నిదర్శనంమన్నారు. మండలంలోనే క్రీడాప్రాంగణాన్ని మొదట నిర్మించి అందుబాటులోకి తెచ్చిన సర్పంచ్ వీరారెడ్డి, పాలకవర్గాన్ని అభినందించారు.జానపాడు మేజర్ చివరి ఆయకట్టు ప్రాంతానికి.. కష్ణానది నుంచి లిఫ్టును.. నిర్మిస్తున్నట్లు.. ప్రభుత్వం ద్వారా సాంక్షన్ అయి నిర్మాణంలో ఉన్న దేవాలయం.. పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.గ్రామానికి స్వచ్ఛందంగా డెడ్‌బాడీ ఫ్రీజర్‌ను అందజేసిన సర్పంచ్‌ని అభినందించారు.బొత్తలపాలెం, అలింగపురం, నాగిరెడ్డిగూడెం, పాలకీడు గ్రామాలలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలఅధ్యక్షుడు అంజిరెడ్డి, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు దర్గారావు, వైస్‌ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, ఉపసర్పంచ్ వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.