Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-హుజూర్నగర్
వక్ప్‌బోర్డు సీఈవో ఆదేశాలను అమలు చేయాలని సోమవారం ముస్లిముల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఆర్డీవో వెంకరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మైనార్టీ ఆ సంఘం నాయకులు అజీజ్‌పాషా, నవాబ్జానీ, ఎండి బిల్లు రహీం మాట్లాడారు.పెంచిన ధరలను అమలు చేయాలని ఉస్మానియా కాంప్లెక్స్‌లోని దుకాణదారులకు ఫిబ్రవరి నెల 21వ తేదీన బోర్డు సీఈవో ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలుచేయడం లేదన్నారు.కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఈ ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు.బోర్డు ఆదేశాలను అమలు చేయని దుకాణం యజమానులను డిఫాల్టర్ల గా ప్రకటించాలన్నారు.కొంతమంది యజమానులు తమ దుకాణాలను సబ్‌లీజులకు ఇచ్చుకుని అధికంగా కిరాయిలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు.పెంచిన కిరాయిలు చెల్లించకపోవడంతో వీటిపై ఆధారపడిన ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఇప్పటికైనా వక్స్ బోర్డు అధికారులు పెంచిన అద్దెలు దుకాణ యజమానుదారులు సక్రమంగా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని,లేనట్టయితే దుకాణాలను ఖాళీ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో పఠాన్గౌస్, ఖాన్, లైటింగ్, ఇబ్రహీం, కాసులుమజీద్, సిరాజ్, దస్తగిరి,ముస్తఫా, ఖలీల్ పాల్గొన్నారు.