Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ బండానరేందర్‌రెడ్డి
నవతెలంగాణ-చింతపల్లి
అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో క్రొండూరు భవాని పవన్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం పెద్దఎత్తున ఫామయిల్ తోటల పెంపకానికి ప్రోత్సాహాకాన్ని అందిస్తుందన్నారు.దీనిపై సర్పంచ్ మరియు ఎంపీటీసీలకు మండల స్థాయిలో అవగాహన నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.మండల స్థాయి అధికారులు అందరూ సర్వ సభ్య సమావేశమునకు హాజరుకావాలని, కానీ వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశిస్తామన్నారు.రెవెన్యూ అధికారులకు అన్ని గ్రామ పంచాయతీలలో క్రీడ ప్రాంగణలకు స్థలాలను గుర్తించి, స్థలాల జాబితాను ఎంపీడీఓకు, సంబంధిత సర్పంచ్ మరియు ఎంపీటీసీలకు ఇవ్వవలసినదిగా అదేశించనైనదన్నారు.విద్యుత్ అధికారులకు మండల ములోగల వంగిపోయిన స్తంభాలను మరియు వదులుగా వున్న లైన్లను సరిచెయుటకు మరియు మరమ్మతులకు గురియై స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏఈ అందుబాటులో లేనందున సంబంధిత డీఈకి ఫోన్ ద్వారా తెలియజేశారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేయుచున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకొనుటకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించవలసిందిగా వైద్యాధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీడీఓ రాజు, సూపర్డెంట్ సోమేశ్వరరావు, వైస్‌ఎంపీపీ యాదయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, ఎంపీటీసీలు మరియు సర్పంచులు,మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.