Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
2011 కౌలు చట్టం అమలు చేయాలని తెలంగాణ కౌలు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు చట్టం అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు వానకాలం సీజన్ ముంచుకొస్తున్న ఇప్పటివరకు ప్రణాళిక సిద్ధం చేయలేదన్నారు.వానకాలం సాగు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని, రైతుబంధు డబ్బులు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని కోరారు 2011 కౌలు చట్టం అమలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.కేంద్ర రాష్ట్ర పథకాలన్నీ కౌలు రైతులకు వర్తింపజేయాలని, ప్రకతి వైపరీత్యాల పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరారు. 58 సంవత్సరాల వయసున్న రైతులందరికీ 5 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలు ఎరువులు అరికట్టాలని, పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.పాసు పుస్తకాలు రాని రైతులకు పాస్ పుస్తకాలు అందించాలన్నారు రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతుసంఘం నాయకులు రాగిరెడ్డి రంగారెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, రైతు సంఘం నాయకులు గోవింద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉన్న వెంకటేశ్వర్లు, బాబునాయక్, ధరావత్ రవినాయక్, నాగేశ్వరరావునాయక్, కోడిరెక్క మల్లయ్య, రామారావు, సోనా, సాయన్న తదితరులు పాల్గొన్నారు.