Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-సూర్యాపేట
తాలూకాగా ఉన్న సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చి అన్నిరంగాలలో అభివద్ధి చేసిన ఘనత రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డిదే నని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పట్టణంలోని 27వ వార్డులో రూ 27లక్షలతో అంతర్గత సీసీరోడ్డు నిర్మాణం, 13వ రూ.20లక్షలతో అంతర్గత సీసీ డ్రెయిన్, 34వ వార్డులో రూ.4.50లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీ, 48వ వార్డులో రూ 4.30లక్షలతో సీసీడ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు.పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.పట్టణ ప్రగతి కింద పట్టణానికి 8.66 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.సూర్యాపేట జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉన్నందున హరిత హారంలో నాటిన మొక్కలను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ తన ఇంటి ముందర నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్టా కిషోర్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు శిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు,వట్టే రేణుక జానయ్యయాదవ్, మడిపల్లి విక్రమ్, వెలుగు వెంకన్న, అనంతుల యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కక్కిరేణి నాగయ్య, భైరు వెంకన్న, భైరు దుర్గయ్య, శిరివెళ్ల శబరినాథ్, మండాది గోవర్ధన్, ఎస్ కె రఫీ, బానోతు జాను, రంగినేని లక్ష్మణ్‌రావు,రావు, దొండ శ్రీను, దండు రేణుక, బొమ్మిడి అశోక్, రామ్, చనగానే అంజమ్మ కల్లెపల్లి మహేశ్వరి, ఈఈ జీకేడి ప్రసాద్, డిిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, వార్డు అభివద్ధి అధికారులు ఎస్ ఎస్ ప్రసాద్, వాడు అభివద్ధి కమిటీ సభ్యులు, ఆయా వార్డుల అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.