Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేం దుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు నుండి 27 ఫిర్యాదులు అందిన్నట్లు, వాటిని సంబంధిత శాఖలకు పరిష్కార నిమితం అందసినట్టు తెలిపారు. విభాగాల వారీగా పరిశీలిస్తే ప్రజావాణిలో 4 ఫిర్యాదులు రెవిన్యూ శాఖ, 18 తహసీల్ధార్ భువనగిరి , 01 భువనగిరి మున్సిపాలిటీ, జిల్లా సంక్షేమ అధికారి 1, జిల్లా ఇరిగేషన్ అధికారి 1, జిల్లా పంచాయితీ అధికారి 2 , ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి , కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.