Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
అర్హులైన దళితులందరికీ దళితబంధు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తుందని కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోటగోపి అన్నారు.సోమవారం దళితులందరికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులందరికి దళితబంధు ఇస్తామని మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తుందన్నారు. దళితబంధుపై రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు అందించాలని కోరారు.లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వాలని కోరారు.ప్రతి దళిత కుటుంబానికి 100 యూనిట్ల ఉచిత కరెంట్ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు.దళితుల కోసం కోదండరామపురంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేటికి పంపిణీ చేయకపోవడం దుర్మార్గ మన్నారు. దళితులకు పెన్షన్లు రాక, ఇండ్లు లేక, స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే వారే లేరన్నారు. దళితుల సమస్యలు పరిస్కారం చేయాలన్నారు అనంతరం తహసీల్దార్ గుగులోత్ కష్ణానాయక్కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నందిగామ సైదులు,తాళ్ళపాక సైదులు, మాతంగి వెంకన్న, బట్టునాగయ్య, నందిపాటి వెంకయ్య, ఉబ్బపెళ్లి సత్యనారాయణ, నందిపాటి శ్రీరాములు, రాంపంగు సైదులు, సునీత, కోటమ్మ, కిరణ్, రాములమ్మ, నాగరాజు, కోట వెంకన్న, మాతం అంజి పాల్గొన్నారు.
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలి
నేరేడుచర్ల:రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేయాలని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జోక్యం అరికట్టాలని కెేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ విషయమై సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు.తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని రుణాలు సబ్సిడీ మంజూరు కాలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన వాగ్దానాలయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు , ఇండ్ల స్థలాలు, 3 ఎకరాల భూమి పంపిణీ, ఆసరా పెన్షన్ మంజూరు చేయకుండా దళితులను మోసగించారన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు దోరేపల్లి వెంకటేశ్వర్లు, గుర్రం ఏసు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమ గుండ్ల నగేష్, కోదాటిసైదులు, బీసీ సంక్షేమసంఘం కార్యదర్శి బెల్లంకొండ గోవింద్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సైదులు, ఎడవల్లి చంద్రయ్య, వడ్లమూడి ఉపేందర్, ఎస్సీ సెల్ మండల నాయకులు ఊటుకూరి సైదులు, మిరియాల శ్రీను,ఆనేగంటి మీనయ్య, రామచంద్రయ్య పాల్గొన్నారు.