Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ క్లాక్‌టవర్
మంగళవారంనాడు కలెక్టర్ తన ఛాంబర్ లో నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద జరుగుతున్న పనులపై మున్సిపల్ కమీషనర్ తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్, నుడా చైర్మన్ మాట్లాడుతూ, ఎన్యూడిఏ (నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి) కింద నల్గొండ తో పాటు చుట్టుపక్క ల ఉన్న ప్రాంతాలు కూడా అభివద్దిలోకి వస్తాయని ఆయన అన్నారు. నుడా ప్రాంతంపై రూపొందించిన మాస్టర్ ప్లాను పరిశీలించారు. నుడా పరిధిలో లే అవుట్స్, వెంచర్లు, బిల్డింగ్ పర్మిషన్స్ పై తదితర అంశాలపై సుదీర్గంగా చర్చించారు. నల్లగొండ పట్టణాభివద్దిలో భాగంగా జరుగుతున్నరహదారుల విస్తరణ, సుందరీకరణపై మున్సిపర్ కమీషనర్ ను సమగ్ర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమీషనర్, నుడా వైస్ చైర్మన్ డా.రమణా చారి, టీపీఓ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.