Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్టాండ్ ముట్టడి
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్‌పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ ఎస్ఎఫ్ఐ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బస్టాండ్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మున్సిపల్ అధ్యక్షులు సాతిరి మనోజ్‌కుమార్ మాట్లాడారు. బంగారు తెలంగాణలో బస్‌ఛార్జీలు పెంచి పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విచ్చలవిడిగా బస్‌పాస్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం బస్టాండ్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, చందు, మధు, ప్రకాశ్, మహేశ్, ముజహిద్, అజ్మతుల్లా, సతీశ్పాల్గొన్నారు.