Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకోడానికి రూ.3లక్షల సహకారాన్ని వెంటనే అందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను వాగ్దానం చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూము ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పెన్షన్లు, రేషన్ కార్డులు, 4 ఏండ్ల కాలంలో ఎలాంటి పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో సర్వే చేసి ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, ఆనంపట్ల కష్ణ, కొండ అశోక్,కొండమడుగు నాగమణి, ఎలాంల్ల వెంకటేష్, సిల్వర్ ఎల్లయ్య, పాండాల మైసయ్య, జిట్టా అంజిరెడ్డి,మోటే ఎల్లయ్య, అబ్దుల్లాపూరం వెంకటేష్, కొండాపురం యాదగిరి,కూకుంట్ల కష్ణ,బొడ ఆంజనేయులు, చంద్రామౌళి,ఉడుత వెంకటేష్,కొండ హైమవతి, కష్ణకుమారి, బండి శ్రీను, మల్లేష్ పాల్గొన్నారు.