Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వాస్పత్రి వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ,ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సాయికిరణ్ నేతత్వంలో ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం పేద ప్రజలకు సేవలందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ సేవలను ఆమె హాజరై ప్రారంభించారు . అంబులెన్స్ పేదల వైద్యం కోసం హైదరాబాదుకు కానీ జనగాంకి ఉచితంగా సేవలు అందించనున్నట్టు తెలిపారు . అనంతరం డయాలసీస్ సెంటర్‌ను పరిశీలించి, రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వి.శంకరయ్య, పీఏసీఎస్ చైర్మెన్ మొగులగాని మల్లేశం, వైస్ చైర్పర్సన్ చింతకింది చంద్రకళ మురహరి , డాక్టర్లు ,సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.