Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ శర్మని మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏలాంటి నిబంధనల్లేకుండా సంస్థ ఐడీ కార్డు ఆధారంగా ఆక్రిడిటేషన్ కార్డు జారీ చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలన్నారు. గతంలో అందుకు సంబంధించిన జీఓలు ఉన్నప్పటికీ నల్లగొండ జిల్లాలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. దళిత జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఆయా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గదె రమేష్, జిల్లా అధ్యక్షులు అయూబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదిని నర్సింహ, జిల్లా గౌరవ సలహాదారులు పుప్పాల మట్టయ్య,నాయకులు పంచ లింగం,సంజీవ్ తదితరులు ఉన్నారు.