Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యార్థులు చిన్నప్పటి నుండే బాగా చదివి ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని, వాటిని సాధించేందుకు శ్రమపడాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. పాలకుర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని జయశ్రీ ఫంక్షన్హాల్లో ఆజాదీకా అమత్ మహౌత్సవ్లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి పాటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 750 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు నగదుతోపాటు మెమోంటోలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడ్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ పాలకుర్ల మురళి, డాక్టర్ వీరేందర్, బొంగు జంగయ్యగౌడ్, బడుగు శ్రీరాములు, పాలకుర్ల భాను, జాఫర్ జావిద్, సౌజన్య, తనుశ్రీ, వెంకటేశం పాల్గొన్నారు.