Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబ సభ్యుల పై నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దీనికి నిరసనగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రాష్ట్ర అగ్రనాయకులు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి పై చేయి చేసుకున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుని ఇష్టానుసారంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డిని గతంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో కాలు విరిగిందన్నారు. చామల కిరణ్ ను పోలీసులు రౌండప్ చేసి తీవ్రంగా కొట్లారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (టి ఆర్ ఎస్) లాలూచీ పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకత్వంపై పోలీసులు అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.