Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన విత్తనాలను అందించాలి
- జిల్లా కలెక్టర్ ను పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి
పట్టణంలో నుంచి ఎరువులు, విత్తనాల దుకాణాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్‌ను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు విరివిగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రతి షాప్ లో స్టార్ట్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ధర్నా ను సూచించే పట్టికలు ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు లేక అధికంగా అంతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు రైతు వేదికల వద్దకు వెళ్లి ఏ ఈ ఓ లను కలిసి తగు సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు. రైతులు పంట వచ్చువరకు ఎరువుల విత్తనాల బిల్లుల భద్రపరచుకోవాలి అని సూచించారు. విత్తన మొలక శాతంలో గాని పంట దిగుబడిలో గాని ఏమైనా అనుమానాలు ఉంటే మండల వ్యవసాయ అధికారుల ను కలవాలని కోరారు .ఈ తనిఖీలో ఏడిఏసి ఆర్ దేవా సింగ్, మండల వ్యవసాయ అధికారి ఏ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.