Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ప్రమాదవశాత్తు చెరువులో పడి మతి చెందిన మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన గుండ్లపల్లి క్రిష్ణయ్య మతదేహాన్ని శుక్రవారం నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా సోమనబోయిన గణేష్‌ను పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని, ఆర్థిక సహాయం అందజేశారు. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన మర్ల రవీందర్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మతి చెందాగ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మాజీ మండల కార్యదర్శి గాయం శ్యాంసుందర్ రెడ్డి , రేగట్టె రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.