Authorization
Wed April 02, 2025 03:26:56 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి ప్రజలకు కావాల్సిన మౌలిక సమస్యలైన ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు,డబల్ బెడ్ రూమ్, దళిత బంధు పథకం అర్హులైన పేదలందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 21వ తేదీన తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు దరఖాస్తుతో వేలాదిగా తరలి రావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిన ఏ ఒక్కటి అమలు జరగలేదన్నారు.అనేక గ్రామాల్లో 25 ఏండ్ల కింద ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన పట్టా హక్కుల ఇచ్చిన నేటికీ ఇండ్ల ్లస్థలాలు పేదలకు అందించలేదన్నారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసుసత్యం,జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, వ్యవసాయకార్మికసంఘం మండల కార్యదర్శి పడమటింటి నగేష్,నాయకులు నిర్మల యాకయ్య, సీఐటీయూ మండలకార్యదర్శి పానుగంటి శ్రీను పాల్గొన్నారు.