Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-వేములపల్లి
ఎడమ కాలువపై ఉన్న లిఫ్టులకు మరమ్మతు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.శనివారం మండలంలోని ఎల్-14 ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మాట్లాడారు.నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పైన ఉన్న ఎత్తిపోతలపథకాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు.ఐదేండ్ల కింద ఆధునీకరణ పేరుతో మోటార్లు, స్టార్టర్లు, పైపులైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు కొత్తవి బిగించారుకానీ కాలువ పూడికలు తూములు, షెట్టర్లు కొత్తవి ఏర్పాటు చేయక నీరు చివరకు పోయే పరిస్థితి లేదన్నారు.ఐదేండ్ల నుండి ఎలాంటి మరమ్మతులు లేక మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంపులు పనిచేయకపోవడంతో ప్రస్తుతం లిఫ్టులు నడిచే పరిస్థితి లేదన్నారు.ప్రభుత్వం చొరవ తీసుకొని లిఫ్టులు మరమ్మతులు వెంటనే చేయించి ప్రభుత్వమే నిర్వహించాలన్నారు.లిఫ్టుల ఆధునీకరణకు 2015-2017 వరకురూ. 200 కోట్లు కేటాయించి కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కాల్వలు,కట్టలు,తూములు సివిల్ పనులు అసలు చేయలేదన్నారు.ప్రస్తుతం మోటార్లు రిపేర్లకు వచ్చినవాటిని వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేనే లిఫ్టులు మరమ్మతులు చేయించి నడిపిస్తానని వాగ్ధానాలు చేసి విస్మరించారని గుర్తు చేశారు.లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇప్పటికైనా వెంటనే సాగర్ ఎడమ కాల్వపైన ఉన్న లిఫ్టులను మరమ్మతులు చేయించి ప్రభుత్వమే నడిపించాలని కోరారు.లేనిపక్షంలో రైతులను కలుపుకోని రైతుసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్,లిఫ్టు రైతులసంఘం అధ్యక్షుడు పాదూరు శశిధర్రెడ్డి,కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు పాల్వాయి రాంరెడ్డి, మండల నాయకులు ప్రణీత్ రెడ్డి,పతాని శ్రీను,సంపత్, రైతులు సతీష్,చెన్నయ్య,బ్రహ్మచారి, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.