Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18వ వార్డులో రూ.10లక్షలతో ఓపెన్‌జిమ్,మినీపార్కు
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణ ప్రగతితో పట్టణాలు అభివద్ధి చెందుతున్నాయని దేవరకొండ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రకుమార్ అన్నారు.శనివారం పట్టణంలోని 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వలక్ష్యమన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుత ఫలితాలతో పాటు పట్టణాల రూపురేఖల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు.పట్టణానికి ప్రతి నెలా రూ.28లక్షలు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందన్నారు.8వ వార్డులో రూ.10లక్షలతో ఓపెన్‌జిమ్,మినీపార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.అంగన్వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.పట్టణాభివద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతినెలా గ్రామాల అభివద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, వైస్‌చైర్మన్ రహత్‌అలీ, స్థానిక కౌన్సిలర్ విరమోని అంజిగౌడ్, కమిషనర్ వెంకటయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేములరాజు, టీిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లికష్ణ, పొన్నబోయిన సైదులు, తౌఫిక్ ఖాద్రీ, ఏఈ రాజు, గండూరి లక్ష్మణ్, ఇస్తర, ఇద్ధిరాములు, రంజాన్‌అలీ, నజీర్, నారాయణ, విజ్ఞనేశ్వర్, ఖాజా,అంజి, కష్ణయ్య, పి.అంజి, కొండల్, జానీ, బాబా, చిట్టి, రాజు, వార్డు మహిళలు పాల్గొన్నారు.