Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
దళితులకు దళితబంధు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శ్రీకర్ విమర్శించారు.ఈ విషయమై సోమవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 40 శాతం ప్రజలు దళితులుగా ఉన్నారన్నారు.వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా దళితులకు దళితబంధు అని ఈ పథకం అమల్లోకి తెచ్చారన్నారు.ఆ పథకం ద్వారా దళిత కుటుంబానికి రూ.10 లక్షలిస్తారన్నారని, కానీ హుజురాబాద్ ఎన్నికల అయిపోయాయి కానీ దళితులకు మాత్రం దళితబంధు అమలు కాలేదన్నారు.కావున వెంటనే రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలని కోరారు.ఒకేసారి ఇవ్వలేకపోతే విడతలవారీగా ఈ పథకం అమలు చేయాలని కోరారు.అలాగే మండలంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఆ విషయంలో కూడా ప్రభుత్వం మాడుగులపల్లి మండలాన్ని చిన్న చూపు చూస్తున్నదన్నారు. మండలంలో మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి చాలా ఉన్నదన్నారు.ఆ భూమిలో దళితులకు మూడెకరాలు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు.అలాగే డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టడానికి స్థలం ఉన్నప్పటికీ కట్టలేని పరిస్థితి ఇలాంటి విషయాలు చూసినప్పుడు ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల నాయకులు అశోక్‌రెడ్డి,నాగయ్య, విష్ణు,సింగం రాములు, మల్లారెడ్డి,సతీష్,ఆదాం,యాదయ్య నాగమణి, రమణ పాల్గొన్నారు.