Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెనక తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ,డీివైఎఫ్‌ఐ ఐద్వా సంఘాల జిల్లా కార్యదర్శులు వనం రాజు,గడ్డం వెంకటేష్,బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అగ్నిపత్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని వారన్నారు. అగ్ని పథకం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమోగానీ వారు దేశద్రోహులు కావడానికి నిరుద్యోగం మరింత పెరగడానికి విద్యార్థి యువజన లను విద్యకు దూరం చేయడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది తప్ప ప్రయోజనం చేసే పథకం కాదని వారన్నారు. యువకుల వయో కాలపరిమితిని వాడుకొని తరువాత జీవనభతి పేరుతో డబ్బులు ఇచ్చి వారిని నిరుద్యోగులుగా మార్చాలని ఉన్నత విద్యను అభ్యసించకుండా చేయాలన్నారు. ప్రభుత్వ కుట్రను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన మతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వీరితో పాటు ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, ఈర్ల రాహుల్ ఉన్నారు.
చౌటుప్పల్ : కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దుచేసి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, అగ్నిపథ్ పత్రాలను దగ్ధంచేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్పాషా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ యువతను మోసం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చి అమలుచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు దేప రాజు, ఎమ్‌డి.ఖాసీమ్, బొడ్డు రాజు, ప్రకాశ్, మనోజ్‌కుమార్, విఘ్నేశ్, శ్రావణ్, ఎమ్‌డి.అబ్బు, సాయిచందు, సాయికుమార్, నర్సింహా, సోహెల్ పాల్గొన్నారు.