Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
భారత ఆర్మీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దుచేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మున్సిపల్ కమిటీ సమావేశం ఆకుల ధర్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ హాజరై మాట్లాడారు. దేశ రక్షణ రంగంలో నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు విధానాన్ని తీసుకువస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అగ్నిపథ్ స్కీమ్ ఉందన్నారు. ఆర్మీలో నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు విధానాన్ని తీసుకురావడం సరికాదన్నారు. దేశ రక్షణ కోసం సైనిక విభాగాల్లో పనిచేసేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దేశ రక్షణ కోసం రిక్రూట్మెంట్ రెగ్యులర్ పద్ధతిలో చేపట్టాలని నిరసన చేస్తున్న వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తుందని విమర్శించారు. నిరుద్యోగులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు బత్తుల దాసు, ఎమ్‌డి.ఖయ్యుమ్, బొడ్డు రాజుగౌడ్, చింతకింది పాండు, చీకూరి ఈదయ్య, ఉష్కాగుల శ్రీనివాస్, కొంగరి కనకయ్య, నెల్లికంటి నర్సింహా, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, మొగుదాల రాములు, దేప రాజు, జంగయ్య, యాదగిరి పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని లౌకిక వాదులు అందరూ వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో దొంతగాని పెద్దలు అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలో కాంట్రాక్టు విధానం తీసుకురావడం కోసమే ఈ అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా ఆందోళనలను దష్టిలో ఉంచుకుని వెంటనే రద్దు చేయాలని కోరారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి పేదవాడికి రూ.3లక్షలు మంజూరు చేయాలన్నారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు గ్రామ గ్రామాన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. హామీల అమలు కోసం సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.ఈ నెల 24 నుంచి 30 వరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు.ఈ ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జి .శ్రీనివాసాచారి, నాయకులు చింతకాయల నరసింహ,పిట్ట రాములు, కడ్తాల బిక్షం,దుబ్బాక లక్ష్మీనారాయణ,మేకల వెంకటయ్య, అంజయ్య, రాచకొండ కష్ణ పాల్గొన్నారు.