Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 110 గంజాయి ప్యాకెట్ల (220 కిలోలు) 12 లక్షల రూపాయలు,
- మూడు కార్లు , 7 సెల్ ఫోన్లను స్వాధీనం
- ఆరుగురు రిమాండ్
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ -నల్లగొండ
గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 110 గంజాయి ప్యాకెట్ల (220 కిలోలు) గంజాయి, సుమారు 12 లక్షల రూపాయలు, మూడు కార్లు , 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని . ఆరుగురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్, బందం, నార్కట్పల్లి పోలీసులు విశ్వసనీయ సమాచారంతో సోమవారం తెల్లవారుజామున నార్కట్పల్లి పిఎస్ పరిధిలోని ఎన్హెచ్ 65 లోని గోపోలాయిపల్లి ఆర్చ్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్ర నుండి హైదరాబాద్ మీదిగ రాజస్థాన్ వెళ్తున్న రెండు వాహనాలను XUV 500 No. RJ 14 UD 1429, TATA Nexon No. RJ 07 CD 3630 గల వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో 50 గంజాయి ప్యాకెట్లు, ఒక్కకటి 2 కేజీలు మొత్తం 100 కేజీల గంజాయి లభించింది. అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆంధ్ర లోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన చింతా వీరబాబు, పెద్దాడ నాగేశ్వర్రావు ఏ నాగేష్, బత్తిని చిట్టిబాబు, పెద్దపాటి నూకేష్, బియ్యాల అప్పలనాయుడు, పెద్దదా చిరంజీవిలు ఆంధ్రాకు చెందిన వూడి శివ గణేష్ వద్ద నుండి తెలంగాణకు సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ రవీందర్ఏరాజు ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ లో ఎక్కువ ధరకు అమ్మేందుకు తీసుకుపోతున్నారు. అంతేకాకుండా రాథోడ్ రవీందర్ రాజు కూడా ఈ మార్గంలో గంజాయిని తీసుకొని No. KA 38 M 4055 గల 20 కారుపై తీసుకొని వస్తున్నాడని చెప్పడంతో అన్ని హైవే పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపగా తనిఖీలు నిర్వహించారు. కట్టంగూర్ పోలీసులు చీన-65లోని నల్గొండ ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా KA 38 M 4055 నెంబరు గల ఐ20 కారునీ ఆపి తనిఖీ చేసి 60 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు మొత్తం 120 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మోగిలయ్య , నల్లగొండడీఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కె. శివరాం రెడ్డి, శాలిగౌరారం సర్కిల్ సీఐ రాఘవరావు, నార్కట్పల్లి పీఎస్ ఎస్ఐ రామకష్ణ, కట్టంగూర్ పీఎస్, యస్. ఐ డి.విజరు కుమార్,సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.