Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -చిట్యాల
రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వానికి అమ్ముకొని నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని, వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బులు రాని బాధిత రైతులతో కలిసి సోమవారం తహసీల్దార్ కష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన అటువంటి పంటను సకాలంలో అమ్ముకోవడానికి అమ్ముకున్న డబ్బులను పొందడానికి అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ధాన్యం అమ్ముకొని రెండు నెలలు అవుతున్నా ఇంకా రైతులకు డబ్బులు రాకపోవడంతో తిరిగి వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి కోసం ప్రయివేటు అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు అప్పుడే ఈ రకమైన పరిస్థితి ఉంటే మధ్య దళారీలు కొనుగోలు చేస్తే రైతులు అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు . ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు రైతుల పంటల కొనుగోలు గ్యారెంటీ ఇచ్చి సకాలంలో రైతుల పంటలను కొనుగోలు చేసి కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించే విధంగా నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నదన్నారు. ఈ యాసంగి పంట బకాయి డబ్బులను వెంటనే రైతులకు చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అయితరాజు నరసింహ, రైతు సంఘం మండల అధ్యక్షుడు లాడే రాములు, రైతు సంఘ పట్టణ కార్యదర్శి అవిశెట్టి నరసింహ ,జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అవి శెట్టి శంకరయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా నాయకులు సాగర్ల యాదయ్య , సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రుద్రారం పెద్దులు,తదితరులు పాల్గొన్నారు.